ప్రతి పనికీ ఓ పద్ధతి అనేది వుంటుందని పెద్దలు చెపుతుంటారు. అలాగే భోజనం చేయడానికీ ఓ క్రమం వుంది. మనం చేసే భోజనంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలుంటాయి. ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని పెద్దలు ఎప్పుడో చెప్పారు. పూర్వకాలంలో పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.