పీవీ సింధుకు సీఎం పురస్కారం : రూ.5 లక్షలు అందజేసిన సీఎం జగన్

బుధవారం, 30 జూన్ 2021 (13:38 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు రూ.5 లక్షల ప్రోత్సహాక నగుదును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం అందజేశారు. అలాగే, అకాడమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించినందుకు సీఎం జగన్‌‌కు పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు. 
 
అదేసమయంలో జులై 23 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొనబోతున్న ఒలింపియన్స్‌ పీవీ సింధు, ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు జగన్ విషెస్ తెలిపారు. వీరిద్దరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్‌‌ను అందజేశారు. 
 
విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్‌ హకీ ప్లేయర్), బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

 

Hon'ble CM @ysjagan conveyed his best wishes to Andhra Pradesh players @pvsindhu1, @satwiksairaj and Rajani Etimarpu who will be participating in Tokyo Olympics 2020 and awarded Rs.5 lakh each for making it to the games. @Tokyo2020 1/2 pic.twitter.com/DybLlFp6WM

— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 30, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు