రెజ్లర్ల నిరసనకు నీరజ్ చోప్రా మద్దతు.. క్రీడాకారులు వీధుల్లో చూస్తుంటే..?

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (12:18 IST)
క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు నిరసనగా అగ్రశ్రేణి కుస్తీ యోధులు చేస్తున్న దీక్షకు ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా తన సంఘీభావం ప్రకటించారు. న్యాయం కోరుతూ మన క్రీడాకారులు వీధుల్లోకి రావడం తనను ఎంతగానో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మనదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, ప్రపంచ వేదికపై మనల్ని గర్వపడేలా చేయడానికి వారు ఎంతో శ్రమించారు. వారు ఎవరైనా కావచ్చు. ఒక దేశంగా ప్రతి వ్యక్తి సమగ్రత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై వుంది. ప్రస్తుతం జరుగుతున్నది ఇంకెప్పుడూ జరగకూడదు. ఇది చాలా సున్నితమైన విషయం. 
 
దీనిని నిష్పక్షపాతంగా పారదర్శకంగా పరిష్కరించాలి. న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో ఒక నోట్‌ను షేర్ చేశారు. ఇంతకుముందు ఒలింపిక్ ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా కూడా వారికి మద్దతు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు