Paris Paralympics.. ప్రధాని నివాసంలో భారత పారా - అథ్లెట్లు (video)

సెల్వి

గురువారం, 12 సెప్టెంబరు 2024 (22:00 IST)
Modi
పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి అత్యున్నత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారత బృందంతో మంత్రి నరేంద్ర మోదీ గురువారం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు.
 
భారత్ ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలతో పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. మొత్తం 29 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో (19) నెలకొల్పబడిన భారతదేశపు అత్యుత్తమ పతకాల రికార్డును ఈ బృందం బద్దలు కొట్టింది. 
 
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 షూటింగ్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు స్కోర్‌తో టైటిల్‌ను కాపాడుకుంటూ, పారాలింపిక్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవని లేఖరా తన జెసరీని ప్రధాని మోదీకి బహుమతిగా అందించింది.
 
అలాగే పారా జూడో పురుషుల 61 కేజీల J1 విభాగంలో కపిల్ పర్మార్ గెలిచిన కాంస్య పతకంపై ప్రధాని మోదీ సంతకం చేశారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు ఫ్రాన్స్ రాజధానిలో జరిగిన పారిస్ 2024 పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
 

#AGNINEWSSERVICES
Indian contingent of #ParisParalympics meets PM
Narendra Modi at his residence in New Delhi pic.twitter.com/Vao0ocAzdI

— Suresh Kumar (@journsuresh) September 12, 2024
భారతదేశం 12 విభాగాల్లో పోటీ పడింది. పారిస్ 2024 పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లైండ్ జూడోలో మూడు కొత్త క్రీడలలో భారతీయ పారా-అథ్లెట్లు పాల్గొన్నారు. 
Modi

 
ఏస్ జావెలిన్ ప్లేయర్ సుమిత్ యాంటిల్ పారాలింపిక్స్‌లో టైటిల్‌ను కాపాడుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రో F64లో 70.59 మీటర్ల అద్భుతమైన త్రోతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఇది కొత్త పారాలింపిక్ రికార్డు. అలాగే హర్విందర్ సింగ్ భారతదేశం తరపున మొట్టమొదటి పారాలింపిక్ ఆర్చరీ ఛాంపియన్‌గా నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు