చెంపదెబ్బలకు కూడా టోర్నీ నిర్వహిస్తున్నారు. బాక్సింగ్ వంటి ఇతర క్రీడా పోటీల తరహాలోనే చెంపదెబ్బలకు కూడా రష్యాలో టోర్నీ నిర్వహిస్తున్నారట. ఆ టోర్నీ వివరాలేంటో చూద్దాం.. రష్యాలోని క్రాస్నోయాస్క్ ప్రాంతంలో చెంపదెబ్బలకంటూ పోటీలు నిర్వహిస్తారు. బాగా కష్టపడి పనిచేసే స్వభావమున్న రష్యన్లు వీకెండ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే వారాంతాల్లో ఇలాంటి విచిత్రమైన పోటీలు పెట్టుకుంటారట.
ఈ పోటీల్లో పాల్గొనే వ్యక్తులకు చెంపలు బూరెల్లా పొంగిపోతాయి. కొన్నిసార్లు దవడ కూడా పగులుతుంది. కాబట్టి పోటీ ముగిసిన వెంటనే డాక్టర్‌తో వైద్యపరీక్షలు చేయించి అవసరమైతే ఉచితంగా చికిత్స అందిస్తారు. ఇక, ఈ టోర్నీలో విజేతలకు వేలల్లో ప్రైజ్‌మనీ వుంటుంది.