ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆతిథ్య రష్యా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4 గోల్స్‌తో ఓటమిపాలైంది. ఫలితంగా రష్యా టోర్నీ నుంచి నిష్క్రమించింది.