సజ్జ లడ్డూలు చేయడం ఎలా..?

మంగళవారం, 29 జనవరి 2019 (11:02 IST)
కావలసిన పదార్థాలు:
సజ్జ పిండి - 400 గ్రా
బెల్లం - 300 గ్రా
ఎండు కొబ్బరి - 100 గ్రా
యాలకుల పొడి - 20 గ్రా
అటుకులు - 100 గ్రా
నెయ్యి - 200 గ్రా.
 
తయారీ విధానం:
ముందుగా ఓ బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి సజ్జ పిండిని వేయించుకోవాలి. తరువాత తురిమిన బెల్లం, ఎండుకొబ్బరి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మిగిలిన నెయ్యిని వేడిచేసి పిండిలో కొద్దికొద్దిగా కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. అంతే... సజ్జ లడ్డూలు రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు