బాదం పప్పుల్లో బ్లీచింగ్ కారకాలు అధికం. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు. అలాగే డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు దీని కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.
తరిగిన ఖర్జూరం, బాదంపప్పులను, ఎండుకొబ్బరి కోరును పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలాకండ్‌తోపాటు పాలల్లో కలిపి సన్నటి సెగమీద వేడి చేయాలి. మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార, మరిగించిన పాలు కలపాలి. పంచదార బాగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి దించేసి.. వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఖర్జూరం, బాదంలతో తయారైన పాయసం సిద్ధమైనట్లే..!