నారా లోకేశ్‌ చొరవతో సౌదీ నుంచి హైదరాబాద్ వీరేంద్ర కుమార్ (video)

వరుణ్

ఆదివారం, 28 జులై 2024 (11:30 IST)
Veerendra
సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జోక్యంతో శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సారెళ్ల వీరేంద్ర కుమార్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ అతని కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. 
 
తనను సురక్షితంగా స్వదేశానికి రప్పించినందుకు మంత్రి నారా లోకేష్‌కి, టీడీపీ ఎన్నారై ఫోరమ్‌కి వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపాడు. వీరేంద్ర దీనస్థితిని ఎత్తిచూపుతూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌కు సహాయం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
 
ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ మోసం చేశాడని అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్రకుమార్ తెలిపాడు. జులై 10న ఖతార్‌లో దిగిన తర్వాత సౌదీ అరేబియాకు పంపించారు.
 
తనకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేయాలని కోరారని వీరేంద్ర వాపోయారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో తట్టుకోలేకపోతున్నానని వీడియోలో చెప్పాడు. తనకు సహాయం చేయకపోతే చనిపోతానని మంత్రికి విజ్ఞప్తి చేశాడు.
 
మంత్రి వీరేంద్ర కుమార్ పోస్ట్‌పై స్పందించి అతనికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నారా లోకేష్‌ ఆదేశాలతో టీడీపీ ఎన్నారై ఫోరం భారత రాయబార కార్యాలయం సాయంతో నరేంద్రను గుర్తించి ఇంటికి పంపించింది.

Successfully repatriated Veerendra Kumar Sarella from Saudi Arabia. Thank you ???? @naralokesh pic.twitter.com/xzQrfhvgWX

— Bhavya???? (@unexpected5678) July 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు