గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాదనీ, మొదటి అడుగుగా జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెబుతున్నట్లు వెల్లడించారు. ఆ పథకాలకు భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెడుతున్నట్లు తెలియజేసారు.
జగనన్న అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చినట్లు తెలిపారు. అలాగే జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, మనబడి నాడు-నేడును మనబడి-మన భవిష్యత్తుగానూ, స్వేఛ్చ పథకానికి బాలికా రక్షగానూ, జగనన్న ఆణిముత్యాలును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చుతున్నట్లు తెలిపారు.