అమెరికాలో మరో తెలంగాణ బిడ్డ చనిపోయాడు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్

సోమవారం, 20 జనవరి 2025 (11:49 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలంగాణా బిడ్డ చనిపోయాడు. నెల రోజుల క్రితం ఓ విద్యార్థి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త మరువక ముందే మరో హైదరాబాదీ యువకుడు కాల్పుల్లో మృతి చెందడం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పరిధిలో ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్డు నంబర్ 2లో ఉండే కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ. గత 2022 మార్చి నెలలో అమెరికాకు వెళ్లారు. అక్కడే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో నిమగ్నమైవున్నాడు. 
 
ఈ క్రమంలో అమెరికా వాషింగ్టన్‌లో దండుగులు జరిపిన కాల్పుల్లో రవితేజ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం తెలియడంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో చైతన్యపురిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, అమెరికాలో దండగులు తరచుగా జరుపుతున్న కాల్పుల్లో భారతీయ యువకులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెల్సిందే. 
 
వైకాపా మళ్లీ వస్తుంది.. ఒక్కొక్కడినీ గుడ్డలూడదీసి నిలబెడతాం 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైకాపా అధికారం కోల్పోయింది. కానీ, 2029లో జరిగే ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అపుడు తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధించిన ప్రతి ఒక్కడినీ గుడ్డలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. ఆయన ఈ హెచ్చరిక పోలీసులను ఉద్దేశించి చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
జిల్లాలోని బోగోలు మండలం కోళ్ళదిన్నెలో టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గాయాలపాలైన వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి ఆవరణలో వైకాపా వర్గీయులు కత్తులతో పట్టుకుని హల్‌చల్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద మరోమారు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా నేతలను ఈ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్కడినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. వైకాపా నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తుందని, అపుడు ఈ పోలీసులు సప్త సముద్రాలు అవతల ఉన్నా లాక్కొచ్చి గుడ్డలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రేపటి రోజున మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పోలీసులు ఊహించుకోవాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు