సినీ ఫక్కీలో.. ప్రియుడితో జంప్ అయిన వివాహిత.. భర్తను చూసి రన్నింగ్ బస్సులో పరార్ (video)

సెల్వి

శనివారం, 1 మార్చి 2025 (20:35 IST)
suganya
ప్రేమ-పెళ్లి బంధాలకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడేలా వుంది. వివాహేతర సంబంధాలకు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా కారణమవుతున్నాయి. తాజాగా ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఇంటి నుంచి పారిపోయింది. 
 
సినీ ఫక్కీలో భర్త నుంచి దూరమై ప్రియుడే కావాలంటూ అతని చేయిపట్టుకుని వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళ భర్త తలపట్టుకున్నాడు. ఇద్దరు పిల్లలతో అనాధగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ ఆమె భర్త జయరాజ్ ఫిర్యాదు చేశాడు.
 
సోషల్ మీడియాలో పరిచయమైన 22 ఏళ్ల గోపి అనే వ్యక్తితో సుకన్య వెళ్లిపోయిందని విచారణలో తేలింది. తన భార్య, ప్రియుడు బైక్‌పై వెళ్తున్నారని తెలిసి, ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద జయరాజ్ పట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. బైకును వెంటనే వదిలేసి.. కదిలే బస్సులో ఎక్కి గోపి, సుకన్య పారిపోయారు. దీంతో పోలీసులకు జయరాజ్ ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత

మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్

తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన… pic.twitter.com/e0oDcb0593

— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు