సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు ఉన్నారు. దీంతో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరుకాలేదు. పార్టీలో, ప్రభుత్వంలో తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్యనాయకులను కలిసి చెప్పినట్లు సమాచారం. పైగా, మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను తొలగించడం, బుధవారం రాత్రి ఆయన కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో.. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు. అదేసమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు.