తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని నాగార్జున కాలనీకి చెందిన దంసాని మమత (22) అనే మహిళకు నవీన్ కుమార్‌తో రెండేళ్ల క్రితం వివాహమైది. అయితే, భార్యను అదనపు కట్నం తీసుకునిరావాలంటూ భర్తతో పాటు.. అత్తింటివారు వేధించసాగారు.
ఈ భార్యాభర్తలిద్దరితో పాటు నవీన్ కుమార్ తమ్ముడు వేణులు కలిసి ఒకే క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. పైగా, నవీన్ కుమార్ మంథనిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుంటే, వేణుకు తండ్రి లింగయ్య ఉద్యోగం వారసత్వంగా వచ్చింది.
ఈ క్రమంలో నవీన్, వేణు, వారి తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం మమతను వేధించసాగారు. అయినా కట్నం తీసుకురాకపోవడంతో మరిధి వేణుతో మమతకు వివాహేతర సంబంధం అంటగట్టారు.