మహిళలపై రోజు రోజుకూ జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు 2006లో గృహ హింస నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కొందరు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో వేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. భర్తను వేధించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని స్పష్టం చేసింది.