దసరా కానుకగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన "ముఖ్యమంత్రి అల్పాహారం" పథకం ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 24 నుండి పౌష్టికాహార అల్పాహారం అందించబడుతుంది.
ఈ కార్యక్రమానికి సుమారు రూ. ఏటా 400 కోట్లతో, విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రారంభించబడింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ పథకం అమలులోకి రానుంది. తమిళనాట ఇప్పటికే ఈ పథకం అమలులో వుంది. ఇదే తరహాలో తెలంగాణలోనూ పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుందని టి సర్కారు భావిస్తోంది.