కాంగ్రెస్ నేతలైన రేవంత్ రెడ్డి, సీతక్క మధ్య కూడా ఇలాంటి అనుబంధమే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దీంతో ప్రతి రాఖీ పౌర్ణమి రోజు రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కడుతుంటారు.
ఈ సందర్భంగా ఆ ఫోటోలను షేర్ చేసిన రేవంత్ రెడ్డి.. ప్రతీ ఆడబిడ్డ ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వావలంబనతో, అన్ని రంగాల్లో ఎదగాలని మనసారా కోరుకుంటున్నా అంటూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.