హైదాబాద్ నగరంలో దారుణం జరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని నాలాలు, మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్కూటరిస్టు అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకునిపోయాడు. నగర శివారులోని సరూర్‌నగర్‌లో గతరాత్రి ఈ ఘటన జరిగింది.
బాలాపూర్ ప్రాంతంలోని 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తుంది. గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పెద్ద ఎత్తున మినీ ట్యాంక్‌బండ్‌కు వెళ్తోంది. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన ఎలక్ట్రీషియన్ నవీన్‌కుమార్ (32) గత రాత్రి సరూర్‌నగర్ చెరువుకట్ట కింద నుంచి తపోవన్ కాలనీ మీదుగా సరూర్‌నగర్ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు.