నవంబర్ నెల రాకముందే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు కూడా కాలేదు, చలి ఎక్కువవుతోంది. తెల్లవారుజామున పలుచోట్ల పొగలు, మంచు కురుస్తున్నాయి.
హన్మకొండ, ఆదిలాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
హన్మకొండ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉండాల్సి ఉండగా, అక్టోబర్ 23వ తేదీ రాత్రి 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గింది.
రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్, మౌలాలి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదే సమయంలో హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పగటిపూట సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.