సాధారణంగా వేసవికాలంలో బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలతో సంబంధంలేదు, చలితో అసలే పనిలేదు. తాగేవాడు తాగుతూనే ఉన్నాడు. గతేడాదితో పోల్చుకుంటే 27.15 శాతం వృద్ది నమోదైందని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. సగటున రోజుకు 12 లక్షల బీర్లు చొప్పున అమ్ముతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏడెనిమిది లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకునేవారు.
ఇప్పుడు ఏకంగా నాలుగు లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుంది. గత యేడాది ఏప్రిల్ - సెప్టెంబరు మధ్యకాలంలో రాష్ట్రంలో రూ.6,724.82 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇదేకాలంలో 20.80 శాతం పెరిగి రూ.8,123.55 కోట్లకు అమ్మకాలు చేరుకున్నాయి. తెలంగాణ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇదే సమయంలో అమ్మకాలు 13.67 శాతం చొప్పున పెరిగాయి.