నిండుగర్భిణీకి కరోనా.. ఆపరేషన్ చేయనంటోన్న వైద్యులు

గురువారం, 15 ఏప్రియల్ 2021 (15:34 IST)
ఆదిలాబాద్ జిల్లాలో నిండుగర్భిణీకి కరోనా సోకింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు నిరకరిస్తున్నారు. మరోవైపు అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆ కుటుంబానికి ఆర్థిక స్థోమత లేని దయనీయ స్థితిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం రెండు రోజుల క్రితం రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. 
 
అయితే సాధరణ ప్రసవం కాకపోవడంతో ఆమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఆపరేషన్‌కు ముందు కరోనా టెస్ట్ చేయడంతో గర్భిణికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు వెనకంజవేస్తున్నారు.
 
దీంతో ఆపరేషన్ నిలిచిపోగా... మరోవైపు హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అయితే అంతదూరం రావడానికి వారికి ఆర్థిక స్థోమత కూడ లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రసవవేదన పడుతుంది. అయితే ఇదే విషయమై ఆసుపత్రి సూపరిండెంట్ మాత్రం వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు