తెలంగాణలో గొర్రెల పెంపకందారుల ప్రయోజనాల కోసం తమ సర్కారు తీసుకుంటున్న చర్యలపై మొదట మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి సుమారు 84 లక్షల గొర్రెలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల ఈ స్టేట్‌లోని గొల్ల కురుమలు, ఇతర గొర్రెల పెంపకందారులకు మేలు కలుగుతుందన్నారు.