గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ యేడాది అన్ని ఆప్షన్‌లలో ఈ తరహా ప్రశ్నలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. దీనికి కారణం కరోనా మహమ్మారి కారణంగా విద్యా బోధన సక్రమంగా జరగకపోవడమే.
కాగా, 2021-22 సంవత్సారానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసింది. ఏదేని సందేహం ఉన్న విద్యార్థులు ఈ మోడల్ ప్రశ్నపత్రాలను చూసుకోవచ్చు. గత యేడాది మూడు సెక్షన్లలో రెండింటింలో మాత్రమే 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఇపుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం.