సౌత్ ఇండియన్ స్టార్ త్రిషకు పితృ వియోగం

శుక్రవారం, 19 అక్టోబరు 2012 (14:01 IST)
WD
దక్షిణాది తారామణి త్రిషకు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి కృష్ణన్(66)కు గురువారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఆయన ఓ ప్రముఖ స్టార్ హోటలో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చింది.

ఆయన పరిస్థితిని గమనించి వెంటనే అంబులెన్స్‌లో దగ్గర్లో ఉన్న యశోదా ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

తండ్రి మరణవార్త తెలుసుకున్న త్రిష తన తల్లితో సహా చెన్నై నుంచి హైదరాబాదుకు వచ్చారు. కృష్ణన్‌కు త్రిష ఒక్కర్తే కుమార్తె.

వెబ్దునియా పై చదవండి