విశ్వవ్యాప్తంగా శత చిత్రాలు పూర్తిచేసుకొని అరుదైన చరిత్రకు శ్రీకారం చుట్టనున్న తొలి తెలుగు అగ్ర కథానాయకుడు బాలయ్య 40 వసంతాలు పైగా తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని, బాలయ్య శత చిత్రాల విశ్లేషణలను, అరుదైన ఫోటోలను, బాలయ్య నటనా వైభావానికి సహకరించిన అన్ని రంగాల ప్రముఖులతో బాలయ్యతో ఉన్న అత్మీయతా భావాలను, ఆనందన క్షణాలను బహుముఖ సేవలను, మంచి మనస్సును, సామాజిక స్పూర్తి గురించి విశ్వవ్యాప్తంగా తెలియపరచాలనే సంకల్పంతో, ఆత్మీయుల స్వహస్తాలతో రాసిన " అక్షర ఆణిముత్యాలను " పుస్తకంగా రూపొందిచడం ఈ పుస్తక ప్రత్యేకత.
అత్యంత భారీ స్థాయిలో బాలయ్య శతచిత్రాల వేడుకలకు సన్నాహాలు చేస్తున్నట్లు, ఈ వేడుకలో బాలయ్యకు బహుమానంగా 9 అడుగుల వెడల్పు, నాలుగున్నర అడుగులు ఎత్తు గల సింహాన్ని మల్టీ కలర్ గ్రానైట్‌తో రూపొందిస్తున్నట్లు, పుస్తక రూపకర్త అనంతపురం జగన్ తెలియజేసారు.