తమిళనాడులోనూ చాలామంది సినిమా తారలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. జయలలిత, ఎంజీఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. చెన్నై చంద్రం త్రిష. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన త్రిష.. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.