ఇంకోవైపు ఎప్పటినుంచో వాయిదా పడుతున్న విశ్వంభర చిత్రం గురించి కూడా ఆగస్టు 22నే కొత్త అప్ డేట్, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల కానుంది. అదేవిధంగా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాల్సి వుంది. లెక్క ప్రకారం ఆగస్టు 22న ప్రారంభించాల్సి వుంది. కానీ సినీ కార్మికుల సమ్మెతో షెడ్యూల్ మొత్తం ఖకావికలం అయినట్లు తెలుస్తోంది. ఇంకా కొలిక్కి రాని కార్మికుల సమ్మె కళ్ళ ముందుండగా పెద్ద మనిషి తరహాలో సమస్యను పరిష్కరించే దిశలో మెగాస్టార్ భుజస్కందాలపై వుండడంతో కొత్త సినిమా ఓపెనింగ్ వాయిదా పడాల్సిన అవసరం వుందని తెలుస్తోంది.
ఇంకోవైపు దర్శకుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఓపెనింగ్ కావాల్సి వుంది. దానిని అక్టోబర్ లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా, కార్మికుల సమ్మెకు పరిష్కారం కూడా ఆగస్టు 22నే ప్రకటించనున్నట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలోపు సమస్య పరిష్కారం అవుతుందని కొద్దిరోజులుగా ఫెడరేషన్ నాయకులు చెబుతున్నా, మళ్ళీ నిన్న కూడా సమ్మె చేయడంతో మెగాస్టార్ పుట్టినరోజున సినీ పెద్దలంతా కార్మికులకు ఫేవర్ గా ప్రకటన వెలువరించనున్నట్లు సమాచారం.