నందమూరి కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ ఫలితంతో సంబంధంలేకుండా వెంటనే మరో సినిమాకు సిద్ధమయ్యాడు. యాక్సన్ డ్రామా చిత్రంగా తీసిన అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇందుకు రకరకాల కారణాలున్నా, ఇప్పుడు చేయబోయే సినిమాను పటాస్ తరహాలో ఎంటర్ టైన్ మెంట్ వేలో తీయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు. కాగా, గిరీశయ్య అనే డైరక్టర్ కళ్యాణ్ రామ్‌కు ఓ కథను చెప్పినట్లు తెలుస్తోంది. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో అర్జున్ రెడ్డిని రీమేక్ చేశాడు గిరీశయ్య.