'ఫెయిర్ అండ్ లవ్లీ' వాడాకే అందంగా ఉన్నట్టు యామీ గౌతమ్ చెప్పగలదా : రాంగోపాల్ వర్మ ట్వీట్

గురువారం, 27 అక్టోబరు 2016 (10:55 IST)
'గౌరవం' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ యామీ గౌతమ్, ఆ తర్వాత హిందీ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో బిజీగా వున్న యామీ గౌతమ్‌ను ఈ మధ్య రాంగోపాల్ వర్మ టార్గెట్ చేశాడు. నిత్యం వివాదాస్పద ట్వీట్లతో సంచలనం సృష్టించే రాంగోపాల్ వర్మ.. యామీ గౌతమ్‌పై పొగడ్తల వర్షాన్ని కురిపించాడు. యామీ గౌతమ్ నటించిన ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసి దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఫెయిర్ అండ్ లవ్లీకి యామీ గౌతమ్ వల్ల అందం వచ్చిందని వర్మ ట్వీట్ చేశాడు. 
 
అంతేకాదు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడాకే తాను అందంగా మారానని చెప్తే బాగుంటుందని, దమ్ముంటే యామీ గౌతమ్ ఆ విషయం చెప్పాలని నిలదీశాడు. ''ట్విట్టర్ ద్వారా నేను యామీ గౌతమ్‌ను సవాల్ విసురుతున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ వాడకముందు తాను అందంగా లేనని, అది వాడాకే అందంగా మారానని యామీ గౌతమ్ చెప్పగలదా? చెప్పలేదు'' అంటూ రామ్ ట్వీట్ చేశాడు.
 
అయితే వర్మ యామీని టార్గెట్ చేయడానికి కూడా కారణం లేకపోలేదండోయ్... వర్మ తాజా చిత్రంలో సర్కార్ - 3లో యామీ గౌతమ్ నటిస్తోంది. అందువలన ఆమె పేరు బాగా పాప్యులర్ కావడం కోసమే ఆయన ఆమెపై కామెంట్లు కుమ్మరించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పబ్లిసిటీ చేసుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా అని మరోసారి అని సినీ వర్గాలు అంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి