ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ మేనియా నడుస్తోంది. ఆమె పేరే అనూ ఇమాన్యుయెల్. ఒకే ఒక్క చిత్రంలో నటించి తన అందాలతో కుర్రకారును చిత్తుచిత్తు చేసిన అనూ ఇమాన్యుయెల్ అంటే ఇపుడు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో కిర్రెక్కిపోతున్నాయి.
ఆమె కాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో వుందో వేరే చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే చిత్రంలో కూడా అనూ ఇమాన్యుయెల్ హీరోయిన్.