24 కిస్సెస్ మూవీ ట్రైలర్ : అందాలను ఆరబోసిన హెబ్బా పటేల్

గురువారం, 25 అక్టోబరు 2018 (16:16 IST)
అదిత్ అరుణ్ - హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం '24 కిస్సెస్'. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకి అయోధ్య కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు. 
 
హీరో హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే రొమాంటిక్ సీన్స్‌పై .. వాళ్ల మధ్య గొడవలపై ట్రైలర్‌ను కట్ చేశారు. రావు రమేశ్.. నరేశ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను నవంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ మధ్య కాలంలో రేసులో హెబ్బా పటేల్ వెనుక పడిపోయింది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆమె వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.


 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు