నేను సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా : సినీ నటి భావన

సోమవారం, 19 డిశెంబరు 2016 (10:03 IST)
సాధారణంగా సెలబ్రిటీలందరూ పెళ్ళి చేసుకోవాలని భావిస్తుంటారు. కానీ, ఈ హీరోయిన్ మాత్రం అలా కాకుండా, సింపుల్‌గా చేసుకోవాలని భావిస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు భావన. దర్శకుడు కృష్ణవంశీ 'మహాత్మ'లతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత గోపీచంద్‌తో 'ఒంటరి' సినిమా చేసింది. అయితే ఈ భామకు తెలుగులో అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు.
 
అయితే మళయాళంలో మాత్రం భావన ఇంకా హీరోయిన్‌గా చేస్తోంది. బేసిక‌గా మళయాళీ అయిన భావన్ ఓ మాలీవుడ్ ప్రొడ్యూసర్‌లతో ప్రేమలో పడిందని ఎప్పటి నుండో న్యూస్ వస్తోంది. కానీ భావన మాత్రం తన లవ్ స్టోరీ ఎప్పుడూ బయటపెట్టలేదు. పెళ్ళి అనేది పర్సనల్ మ్యాటర్ కాబట్టి భావన మీడియా ముందు తన లవ్ స్టోరీ విషయంలో సైలెంట్‌గా అయిపోయింది. ఎటువంటి మీడియా కవరేజ్ లేకుండానే త్వరలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్టు భావన  సూచన ప్రాయంగా వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి