తాను నటించే చిత్రాల్లో హీరోలతో ముద్దు పెట్టే సన్నివేశం వస్తే మాత్రం ఏమాత్రం వదులుకోనని హీరోయిన్ రీతూ వర్మ చెప్పారు. ఆమె తాజాగా "మజాకా" అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె స్పందిస్తూ, సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకం కాదన్నారు. తాను నటించే చిత్రాల్లో కిస్ సీన్లు వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పారు. ఛాన్స్ వస్తే మాత్రం కిస్, హగ్ సన్నివేశాల్లో జీవిస్తూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
తన గత చిత్రం "స్వాగ్" ఫెయిల్యూర్‌పై ఆమె స్పందిస్తూ, ఆ సినిమా అందరికీ సంబంధించినది కాదని, మేము మందు నుంచే అనుకున్నాం. ఆ కథలో ఉన్న తీవ్రత చాలా మందికి అర్థంకాలేదు. అయినా ఫర్లేదు. ఎందుకంటే మనం నటించే అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆదరించాలని లేదు కదా. ఒక నటిగా ఆ సినిమా చేసినందుకు నేను మాత్రం సంతృప్తిగానే ఉన్నా అని చెప్పారు.