కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ నిశ్చితార్థం

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (21:57 IST)
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్‌, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. 
 
కాగా వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌ లెవల్‌లో చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్‌ చేస్తోంది. రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానించబోతున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి