టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. ఆయనేంటి కడుపుబ్బ నవ్వించడమేంటి అనుకుంటున్నారా. నిజమే.. ఎప్పుడూ మాస్, ఫ్యామిలీ ఓరియెంటెండెంట్ సినిమాల్లో నటించే నాగార్జున మొదటిసారి ఫుల్‌లెంత్ కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. అది కూడా మల్టీస్టారర్ చిత్రంలో. మరో హీరో నాని కూడా ఇందులో నటించబోతున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే ఇద్దరూ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
'భలే మంచిరోజు', 'శమంతకమణి' చిత్రాలతో తనేంటో నిరూపించుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. కథను చెప్పగానే నాగార్జునకు బాగా నచ్చేసిందట. దీంతో తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని దర్శకుడికి చెప్పారట నాగ్.