హిందీని బట్టి ఇండియన్‌ను డిసైడ్ చేస్తారా? అనేక్ ట్రైలర్ వైరల్

సోమవారం, 9 మే 2022 (12:07 IST)
JD
యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకుడు అనుభవ్ సిన్హా కాంబినేషన్‌లో 'అనేక్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో జేడీ చక్రవర్తి కీలకపాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
ఈ ట్రైలర్‌లో ముందుగా జేడీ చక్రవర్తిని 'మీరు ఎక్కడివారు..?' అని ప్రశ్నిస్తాడు ఆయుష్మాన్. దానికి అతడు 'తెలంగాణ.. సౌత్' అని చెప్తాడు. వెంటనే ఆయుష్మాన్.. 'తెలంగాణ.. తమిళనాడుకి నార్త్‌లో ఉంటుందని.. అప్పుడు తమిళనాడు జనాలు మిమ్మల్ని నార్త్ ఇండియన్ అని పిలవాలని' అంటారు. దానికి జేడీ 'బహుశా' అని బదులిస్తారు. 'నేను ఎక్కడ వాడినని మీరు అనుకుంటున్నారు..?' అని జేడీని ప్రశ్నిస్తారు ఆయుష్మాన్.
 
దానికి అతడు.. 'నార్త్ ఇండియా' అని చెబుతారు. 'మీకెందుకు అలా అనిపించిందని' అడుగుతాడు ఆయుష్మాన్. 'ఎందుకంటే మీ హిందీ చాలా నీట్‌గా ఉంది' అని చెబుతారు జేడీ.
 
'సో ఎవరు నార్త్ వాళ్లో.. ఎవరు సౌత్ వాళ్లో.. హిందీ డిసైడ్ చేస్తుందన్నమాట' అని సందేహం వ్యక్తం చేస్తారు ఆయుష్మాన్. దానికి జేడీ 'నో..' అని చెప్తారు. 
 
ప్రస్తుతం ఈ డైలాగ్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సెలబ్రిటీలు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  

This scene in #AnekTrailer beautifully shows the judgement over language that alot of people in India are facing

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు