హైదరాబాద్ వీధుల్లో అర్థరాత్రి చక్కర్లు కొట్టిన చార్మీ కౌర్ (వీడియో)

బుధవారం, 17 జనవరి 2018 (08:41 IST)
డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న నటి చార్మీ కౌర్. ఇపుడు సినీ అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. తన సోదరుడు శ్రీధర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రైడ్ చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఇదిలావుంటే, తాజాగా ఆమె తన పెంపుడు చిలుక 'మిట్టూ'తో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ దానితో ఆడుకుంది. దానికి అన్నం తినిపిస్తూ లిప్ కిస్ ఇచ్చింది. తాను మిట్టూతో కలసి లంచ్ చేస్తున్నానంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది. 
 
చార్మి పోస్ట్ చేసిన ఈ వీడియో అభిమానుల‌ను అల‌రిస్తోంది. చార్మికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అప్పుడ‌ప్పుడు త‌న పెంపుడు శున‌కాల‌తో క‌లిసి ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. 

 

Bike ride on the streets of Hyd

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు