నిజానికి ఆయన గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రాగా, ఆయన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆయనకు ఓ చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉండగా, అస్వస్థతకు గురైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది.
కానీ, దాసరి ఆరోగ్య పరిస్థితిపై ఆయన మేనేజర్ స్పందించారు. ప్రతి యేడాది చలికాలంలో దాసరికి ఆరోగ్య రెగ్యులర్‌గా చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ చెకప్‌లలో భాగంగానే ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.