నటుడు అలీ మాట్లాడుతూ, హ్రీం చిత్ర నిర్మాతలు శివమల్లాల , సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మించ తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ– ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. హీరో, హీరోయిన్ పవన్, చమిందా, దర్శకుడు రాజేశ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. హ్రీం చిత్ర హీరోయిన్ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్ తాతా, దర్శకుడు రాజేశ్ నాకు ముందునుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి హ్రీం చిత్ర నిర్మాత శివ మల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈ ప్రారంభోత్సవంలో దర్శక–రచయిత జనార్థనమహర్షి, నిర్మాత కె.బాబురెడ్డి, తమిళ నిర్మాత జి.సతీష్ కుమార్, ట్రెండింగ్‌లవ్ దర్శకుడు హరీష్ నాగరాజ్, బహిష్కరణ చిత్ర దర్శకుడు ముకేష్ ప్రజాపతి , ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, వనిత , శ్రీవాణి త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కథ–కథనం–దర్శకత్వం – రావూరి రాజేష్. నిర్మాత– శివ మల్లాల, కెమెరా– అరవింద్, సంగీతం– మార్కస్.యం, ఎడిటర్– ప్రణీత్ కుమార్, కళ– సుధీర్ మాచర్ల క ఫేమ్, వీ.ఎఫ్.ఎక్స్ డైరెక్టర్– రాజ్ పవన్ కొమ్మోజు, సౌండ్ డిజైనర్– సాయి మనీంధర్, డి.ఐ– ఎస్.జె కార్తీక్ డి.ఎఫ్.టెక్.