ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, మా ఎన్నికల్లోకి నేను రాను అన్న నరేష్ ఇపుడు అర్జునుడు కృష్ణుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారని ఆమె నిలదీశారు. వీళ్లు కొందరు ఫాన్స్‌తో ఏవేవో చేయిస్తున్నారని.. సభ్యులు బెదిరి పోవాల్సిన అవసరం లేదన్నారు.
నరేష్‌తో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నరేష్ ఎలాంటి వాడో నాకు తెలుసునని జీవిత రాజశేఖర్ తెలిపారు. సభ్యులకు ఏమి కావాలో అది చేద్దాము.. అవే చెబుతామని ఆమె సూచించారు. మీరు సభ్యులను భయ పెడుతున్నారా? ప్రకాష్ రాజ్ ఇక్కడ ఉండడు అంటున్నారు.. అయన లేకపోతే మేము వున్నాము కదా..? నరేష్ ఎప్పుడైనా వున్నాడా..? మేము కదా చేసింది.. నా వరకు నేను ఎంత సిన్సియర్‌గా పనిచేశానో చెపుతానన్నారు. నరేష్ అవకాశం ఇవ్వలేదు అందుకనే చాలా పనులు ఆగిపోయాయన్నారు.
నరేష్, మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి.. మోహన్ బాబు, విష్ణు మీరటే నాకు రెస్పెక్ట్ వుంది.. ఎందుకు నరేష్ సపోర్ట్ తీసుకుంటున్నారని జీవిత ప్రశ్నించారు. ఎన్నికల బరిలో రెండు ప్యానెల్స్‌గా వున్నాము.. హెల్తీగా కాంటెస్ట్ చేద్దాము... ప్రకాష్ రాజ్‌ను లోకల్.. నాన్ లోకల్ అంటున్నారు.