కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ సినిమా అంటే భారతీయుడు గుర్తుకు వస్తుంది. ఆ సినిమా భారతీయ చలనచిత్రరంగాన్ని కుదిపేసింది. భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత మరలా వీరి కాంబినేషన్‌లో సీక్వెల్ వస్తుందని వార్తలు వచ్చాయి. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. తాజాగా విక్రమ్ సినిమా కమల్‌హాసన్ నటించిన చిత్రం బాక్సీఫీస్‌ను షేక్ చేసేసింది. దాంతో కమల్‌కు పూర్తి ధైర్యం రావడం, అంతకుముందు శంకర్‌తో వున్న చిన్నపాటి స్పర్థలు తీరిపోవడం జరిగింది.