తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. గత 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పండుగను జరుపుకోలేకపోయారు. ఇపుడు ఈ యేడాది అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధమైంది. ఈ యేడాది ఈ నెల 25వ తేదీన ఈ బతుకమ్మ వేడుక జరుగనుంది.
దీంతో బతుకమ్మ నిర్వహణపై హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఇందులో సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.