ఛైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్ విష్ణు వర్ధన్‌తో కలిసి హలో డాడీ సినిమాలో పనిచేశాడు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. ఆ తర్వాత ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో నటించారు. కాగా.. శుక్రవారం రాత్రి వున్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్ తుది శ్వాస విడిచారు. యువనటుడి మరణంతో శాండల్‌వుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమానులు నితిన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.