సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో రాణిస్తూ ఏంతో మందికి సహాయం చేస్తూ సక్సెస్ విమెన్గా దూసుకు పోతున్న మిత్ర శర్మ ఈ రోజు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకొంది. శ్రీపిక్చర్స్ పతాకంపై మిత్రశర్మ, గీతనంద్ జంటగా దయానంద్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్రశర్మ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం "బాయ్స్". దీనికి (బాయ్స్ విల్ బి బాయ్స్) అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక హైదరాబాద్లోని దస్ బల్లా హోటల్లో కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హీరో కార్తికేయ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. సుచిర్ ఇండియా కిరణ్, కళా మందిర్ కళ్యాణ్ శ్రీ పిక్చర్స్ పోస్టర్స్, లోగోలను విడుదల చేశారు.