చెన్నై మెరీనాలో నీట మునిగి యువకుడు మృతి.. ఇద్దరు గల్లంతు

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:22 IST)
తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నీట మునిగి ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తి గుంటూరు జిల్లా విద్యార్థి. మిగిలిన ఇద్దరు కృష్ణాజిల్లాకు చెందిన వారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్‌ (18) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
 
చెన్నైలో ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్‌(18) పాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు. 
 
అక్కడ ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్‌, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. రాజశేఖర్‌, శివప్రశాంత్‌ ఒడ్డున ఉన్నారు. మిగిలిన వారు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు