టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగ్ దే'. సితార అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 26న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా పెంచేసింది చిత్రయూనిట్. తాజాగా కీర్తి సురేష్, నితిన్ పై ప్రతీకారం తీసుకుంది. ఈమేరకు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఫన్నీ వీడియో షేర్ చేస్తూ నెటిజన్స్‌ను అలరించింది.