యువహీరో నిఖిల్ - శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రం "కిర్రాక్ పార్టీ". సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డేలు హీరోయిన్లు. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఫలితంగా తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
ఆ తర్వాత మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.15 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసిందట. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా, మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను సాధించడం సినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎన్నో రోజులు పట్టదనే విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లనే ఈ స్థాయి సక్సెస్ సాధ్యమైందంటూ.. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చిన నిఖిల్, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
కాగా, ఈ చిత్రం గతంలో వచ్చిన హ్యాపీడేస్ తరహాలో యూత్‌ను బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా ఈ చిత్రానికి యూత్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కారణంగా అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కిర్రాక్ పార్టీ చిత్రం ప్రదర్శితమవుతోంది.