ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యువత కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనే సందేశం ఈ సాంగ్ లో ఉంది. భాస్కర భట్ల రవి కుమార్ గారు అద్భుతమైన సాహిత్యం రాశారు. ఈ సాంగ్ సినిమాకే కాదు యువతరానికి కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడుతూ.. ధైర్యం, ప్రజా సేవకు ప్రతీక అయిన గౌరవనీయులైన జె.డి. లక్ష్మీ నారాయణ గారు మా చిత్రం కృష్ణ లీల నుండి “సూరి ఓరి సూరి” సాంగ్ విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన ఇక్కడకి రావడం ఈ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా, మా మొత్తం టీంకి స్ఫూర్తిని పెంచింది. తన నిర్భయ సేవ, సత్యం పట్ల నిబద్ధత ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, ఆయన మా పాటను ఆవిష్కరించడం మేము ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం. “సూరి ఓరి సూరి” పవర్ ఫుల్ మోటివేషనల్ సాంగ్. ఒక తొలి దర్శకుడిగా, తెలుగు సినిమా లెజెండ్స్ నాకు గొప్ప ప్రేరణగా నిలిచారు. వారు మనకు గొప్పగా కలలు కనడం నేర్పారు. రాజమౌళి గారి విజన్, సుకుమార్ గారి పొయిటిక్ నరేషన్, సందీప్ రెడ్డి వంగా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంటేషన్.. ఇవన్నీ నా ప్రయాణాన్ని బలంగా ప్రభావితం చేశాయి. కృష్ణ లీల ఆ అభిమానం నుండి పుట్టింది. కృష్ణ లీల యూనిట్ తరపున మాకు మద్దతు ఇచ్చినందుకు జె.డి. లక్ష్మీ నారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఆశీర్వాదాలతో ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాము'అన్నారు.