ఈ సినిమాకు హిందీ డబ్ ఓ విశేషం. అజయ్ దేవగణ్ తన గొంతు ఇస్తుండగా, అతని కుమారుడు యుగ్ దేవగణ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తన వాయిస్ ఓవర్ డెబ్యూ చేస్తున్నాడు. ఒకే సినిమాలో తండ్రి-కొడుకు కలిసి పని చేయడం ఇదే తొలిసారి!
తాజాగా విడుదలకు ముందు జాకీ చాన్, బెన్ వాంగ్తో కలిసి అజయ్–యుగ్ మాట్లాడారు.
అజయ్ మాట్లాడుతూ , తన తండ్రి వీరు దేవగణ్ గురించీ, తనకు మిస్టర్ మియాగీలా ప్రేరణ ఇచ్చిన గురువు అని గుర్తు చేసుకున్నారు. “ఆయన కోరికే నన్ను నటుడిని చేసింది,” అన్నారు. దానికి జాకీ స్పందిస్తూ, “నాకు ఒక్క మిస్టర్ మియాగీ కాదు, ఎందరో గురువులున్నారు. అందరికీ నేన్ ఈ రోజు కృతజ్ఞుడిని,” అన్నారు.
యాక్షన్ ఎలాగా మారింది? అనే ప్రశ్నకు అజయ్ చెబుతూ – “మునుపటిలా కేబుల్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది. కానీ హార్డ్ వర్క్‌కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు,” అని స్పష్టంగా చెప్పారు.
జాకీ చాన్ మాత్రం ఇండియాలో కంగ్ ఫూ యోగా షూటింగ్, బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్ గురించిన మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. “బాలీవుడ్ డ్యాన్స్ చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతా. అంతటి టైమింగ్, గ్రేస్, రిథమ్ ఉంటాయ్. ఒకసారి మాత్రం నేను ఫుల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయాలి అనిపించింది,” అని నవ్వుతూ చెప్పారు. యాక్షన్ – డ్యాన్స్ రెండూ ఒకే కిందికి వస్తాయన్నారు జాకీ: “ఇవి రెండూ రిథమ్, ఫ్లో, ఎక్స్‌ప్రెషన్‌తో సాగుతాయి. అందుకే నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా.”బాలీవుడ్ – జాకీ చాన్ కలయిక? ఈ చర్చలో ఒక ఆసక్తికర సిగ్నల్ కూడా వెలువడింది – జాకీ చాన్ ఒక బాలీవుడ్ మూవీకి పూర్తిస్థాయి పాత్ర చేయాలన్న సంకల్పాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ అభిమానులకి ఇది పెద్ద గుడ్‌న్యూసే!
కరాటే కిడ్: లెజెండ్స్లో యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ విలువలు అన్నీ ఉండబోతున్నాయి. దానికి తోడు జాకీ చాన్ – అజయ్ దేవగణ్ కలయిక... మరి ఇంకేం కావాలి? మే 30న థియేటర్లలో కలుద్దాం!