మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించి మరో పాటను యూట్యూబ్లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాలు.. కడగండ్ల నేపథ్యంలో చిత్రీకరించిన ‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’ అంటూ సాగే ఈ పాట అన్నదాతలనే కాదు, ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉంది.
ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు, ముఖ్యంగా ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ అనే పాటకు భారీ స్పందన వచ్చింది. ఆ తర్వాత రత్తాలు అనే ఐటమ్ సాంగ్కు మంచి స్పందన వచ్చింది. అయితే, ఆరు పదుల వయసులో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటే గంతులేయడం ఏమిటంటూ అనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు ఈ తాజా పాట చెక్ పెట్టింది.